HomeTELANGANAతుమ్మిడిహెట్టి బ్యారేజీకి మహారాష్ట్ర సానుకూలత.. 152 మీటర్ల ఎత్తు పెంపుపై అధ్యయనానికి కమిటీ

తుమ్మిడిహెట్టి బ్యారేజీకి మహారాష్ట్ర సానుకూలత.. 152 మీటర్ల ఎత్తు పెంపుపై అధ్యయనానికి కమిటీ

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ముంబైలో కీలక చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాలని ప్రతిపాదించింది. దీనివల్ల గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలు మెరుగుపడటంతో పాటు విద్యుత్, నిర్వహణ వ్యయాలు తగ్గుతాయని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. ముంపు, నీటి లభ్యత, పరిహారం, సాంకేతిక అంశాలపై అధ్యయనం చేసేందుకు ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments