అహ్మదాబాద్‌లోని యువత గర్బా పట్ల విశేష ఉత్సాహం చూపుతున్నారు. ఫేషియల్స్, స్కిన్‌కేర్ ప్యాకేజీలకు బదులుగా వారు చర్మానికి మెరుపును తీసుకురావడానికి డ్రిప్స్‌ను ఎంచుకుంటున్నారు. చాలామంది సరైన అర్హత లేని బ్యూటీ క్లినిక్‌లు లేదా సెలూన్లలో తక్కువ ఖర్చుతో దొరుకుతున్నాయని ఈ డ్రిప్స్ వేయించుకుంటున్నారు. ఇది ప్రాణాంతకం కావచ్చు. ఎట్టిపరిస్థితుల్లోనూ వైద్యులు లేని చోట, అత్యవసర చికిత్స సదుపాయం లేని ప్రాంతాల్లో ఐవీ మందులు తీసుకోకూడదు. అస్సలు ఐవీ డ్రిప్స్ అంటే ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?


