ఇంటి గోడలకు రంగులు ప్రత్యేక ఆకర్షణను తీసుకువస్తాయి. ఏదైనా శుభకార్యాల సమయం లేదా పండగల సమయంలో చాలా మంది ఇంటి గోడలకు పెయింట్ వేయిస్తారు. ఇంటికి కొత్తగా పెయింట్ వేయించినప్పుడు గోడలు ఎంతో అందంగా, మెరుస్తూ కనిపిస్తాయి. ఇల్లు ఇప్పుడే కట్టినట్లు సరికొత్త కళతో ఉంటుంది. కానీ రోజులు గడిచేకొద్దీ రకరకాల కారణాల వల్ల గోడలపై జిడ్డు, దుమ్ము, ఇతర మొండి మరకలు పడతాయి.
వీటిని గట్టిగా రుద్ది క్లీన్ చేద్దామనుకుంటే పెయింట్ ఊడిపోతుందేమోనన్న భయం ఉంటుంది. అలాగని మరకలు పడ్డ ప్రతిసారీ పెయింట్ వేయించడం సాధ్యం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. అటువంటి పరిస్థితుల్లో వంటింట్లో దొరికే సహజ పదార్థాలతో చేసే ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. పెయింట్ పాడవకుండా మరకల్ని వదిలించి, మీ ఇంటిని మళ్లీ అందంగా మెరిపించేందుకు సాయపడుతుంది. ఆ చిట్కాలేంటో ఓ లుక్కేద్దాం.


