Vijay Kedia Tips: స్టాక్ మార్కెట్లో రాణించాలంటే ఎంతో అనుభవం, నైపుణ్యం ఉండాలి. కొన్నిసార్లు ఈ రెండూ ఉన్నా సమయంతో పాటు ఓపికతో వేచి చూడాలంటున్నారు ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కేడియా. స్టాక్ మార్కెట్లో ఓపిక ఎందుకు అవసరమో చెప్పేందుకు చైనా వెదురు మొక్కను ఉదాహరణగా చూపించారు. కొన్ని పంటలు పండేందుకు 5 సంవత్సరాల సమయం పడుతుందని, ఆ తర్వాత వేగంగా పెరుగుతాయంటూ తెలిపారు. ఈటీ వెల్త్ ఎక్స్‌పోలో ఆయన చెప్పిన కొన్ని టిప్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.


