HomeNation and Worldమొదలైన కుంభమేళా.. మారిన నాసిక్, త్రయంబకేశ్వర్ రూపురేఖలు.. రూ.35 వేల కోట్లతో 350 ప్రాజెక్టులు

మొదలైన కుంభమేళా.. మారిన నాసిక్, త్రయంబకేశ్వర్ రూపురేఖలు.. రూ.35 వేల కోట్లతో 350 ప్రాజెక్టులు

గోదావరి జన్మస్థలం వద్ద కుంభమేళా సందడి ప్రారంభమైంది. ఈ సింహస్థ కుంభమేళా కోసం మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.35 వేల కోట్లతో 350 ప్రాజెక్టులు చేపట్టింది. 150 కిలోమీటర్ల రోడ్లు, గోదావరిపై 8 బ్రిడ్జిలు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, కొత్త స్నాన ఘాట్లు, ఆలయాల పునరుద్ధరణ వంటి పనులు ఇందులో ఉన్నాయి. గోదావరి పరిశుభ్రత కోసం 4 మురుగునీటి శుద్ధి కేంద్రాలు, 200 కిలోమీటర్ల పైప్‌లైన్ల నిర్మాణం చేపట్టారు. కుంభమేళా ముగిసిన తర్వాత కూడా కనీసం 3 దశాబ్దాల పాటు ఈ సదుపాయాలు ప్రజలకు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. అయితే వర్షాభావ పరిస్థితుల్లో నీటి నిర్వహణ కీలక సవాలుగా మారనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments