ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నిర్వహించిన ఓటు బచావో.. దేశ్ బచావో ర్యాలీకి తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఓటర్ల జాబితా నుంచి కోట్లాది ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలను ఢిల్లీకి వెళ్లకుండా రైళ్ల కేటాయింపులో అడ్డంకులు సృష్టించారని అయినా కాంగ్రెస్ కార్యకర్తల సంకల్పాన్ని అడ్డుకోలేరన్నారు.


