‘ఖడ్గం’ చిత్రంలో ఉగ్రవాది అజర్ పాత్రతో టాలీవుడ్‌ను నివ్వెరపరిచారు నటుడు షఫీ. ఆయన చూపించిన క్రూరత్వం, సంభాషణల శైలి చూసి అప్పట్లో ప్రేక్షకులు ఆయన్ను నిజంగానే ‘పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చారా?’ అని చర్చించుకున్నారు. పాత్ర సహజత్వం కోసం చార్మినార్ గల్లీల్లో తిరుగుతూ ఎన్నో విషయాలు నేర్చుకున్న ఆయన తొలి చిత్రానికే ఫిల్మ్‌ఫేర్ అందుకున్నారు. చంద్రగిరిలో పుట్టి ఢిల్లీ NSDలో శిక్షణ పొందిన షఫీ.. ‘ఛత్రపతి’లో అసూయతో రగిలే సోదరుడి పాత్రతో పాటు దూకుడు, దృశ్యం 2 లాంటి 50కి పైగా చిత్రాల్లో వైవిధ్యమైన నటనతో మెప్పించారు. ప్రస్తుతం ఆర్భాటాలు, ప్రచారాలకు దూరంగా ఉంటూ ఆయన వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తున్నారు.
‘ఖడ్గం’ చూసి నిజంగానే పాకిస్తాన్ టెర్రరిస్ట్ అనుకున్నారు… తొలి చిత్రంతోనే ప్రేక్షకుల గుండెల్లో దడ పుట్టించిన షఫీ
RELATED ARTICLES


