రాజమండ్రి జైలు నుంచి విడుదలై మూడేళ్లైందని, నాటి 53 రోజుల నిర్బంధాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబునాయుడు ఎమోషనల్ ట్వీట్ చేశారు. నాలుగున్నర దశాబ్దాల తన పొలిటికల్ లైఫ్లో ఆ 53 రోజులే అత్యంత కఠినమైనవని ఆయన పేర్కొన్నారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నంద్యాలలో నన్ను అర్ధరాత్రి అన్యాయంగా అరెస్టు చేశారు” అని నాటి చేదు అనుభవాలను పంచుకున్నారు. అప్పట్లో తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మీ నమ్మకం, అభిమానం తన బలమని మీ భవిష్యత్తే నా సంకల్పమని ట్వీట్లో స్పష్టం చేశారు.
రాజమండ్రి జైలు నుంచి విడుదలై మూడేళ్లు.. నాటి 53 రోజుల అక్రమ నిర్బంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు
RELATED ARTICLES


