HomeTELANGANAరైతులను తప్పుదోవ పట్టించొద్దు..క్రాప్ హాలిడే ప్రచారంపై మంత్రి తుమ్మల

రైతులను తప్పుదోవ పట్టించొద్దు..క్రాప్ హాలిడే ప్రచారంపై మంత్రి తుమ్మల

తెలంగాణలో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు నష్టపోకుండా ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రైతు వేదికలు, రైతునేస్తం కార్యక్రమాల ద్వారా సాగు సూచనలు అందిస్తున్నామని, సబ్సిడీపై వివిధ పంటల విత్తనాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి పంట నష్టాలపై సర్వేకు ఆదేశించినట్లు చెప్పారు. ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వివరించారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments