హైదరాబాద్లో త్వరలోనే వింటర్ ఉత్సవ్ మేళా ప్రారంభం కానుంది. ఈసారి ఈజిప్ట్ నాగరికతను ప్రతిబింబించే పిరమిడ్లు, ఫారోల రూపాలు, ప్రత్యేక అలంకరణలు సందర్శకులకు కొత్త అనుభూతిని అందించనున్నాయి. రష్యా, ఇథియోపియా, భారత్కు చెందిన కళాకారులు సర్కస్ విన్యాసాలు, ఏరియల్ ప్రదర్శనలు, మ్యాజిక్, సాహస కార్యక్రమాలతో అలరించనున్నారు. వీటితో పాటు పిల్లలు, యువత కోసం అమ్యూజ్మెంట్ రైడ్స్, వివిధ రకాల ఆహార స్టాళ్లు, షాపింగ్ సదుపాయాలు కూడా ఉండనున్నాయి.


