రోజూ స్నానం చేసేటప్పుడు సబ్బు వాడుతాం. అయితే ఏ సబ్బు మన చర్మానికి మంచిదో చాలామందికి తెలియదు. అందుకు అనుగుణంగా మార్కెట్లో అనేక రకాల బ్రాండ్లకు సంబంధించిన సబ్బులు అందుబాటులోకి వస్తున్నాయ్. అయితే సాధారణ సబ్బుల కంటే ఆర్గానిక్ సబ్బులు వాడటం మంచిదని కొందరు భావిస్తారు. సహజమైన పదార్థాలతో తయారవుతాయి కాబట్టి ఇవి చర్మానికి హాని చేయవని అనుకుంటారు. కానీ ఆర్గానిక్ సబ్బులు అందరికీ సరిపోతాయా, సాధారణ సబ్బులు చర్మాన్ని పొడిబారేలా చేస్తాయా, ఈ రెండింటి మధ్య తేడాలేంటి, చర్మానికి ఏది అనుకూలమో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.


