Gold Investment Strategy: ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఈ ఏడాది జనవరిలో ఆల్ టైమ్ గరిష్ఠాలను చేరగా అక్కడి నుంచి వరుసగా తగ్గుతూ వచ్చాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా క్రూడాయిల్ పెరగడం, ద్రవ్యోల్బణం పెరగ్గా ఇదే సమయంలో డాలర్, బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడంతో పసిడి ధరలు పడుతూ వచ్చాయి. గరిష్ఠాల నుంచి 25 శాతానికిపైగా పడిపోగా, ధన్‌తేరాస్ ముందు ఈ ధరల తగ్గుదల పెట్టుబడిదారులకు అవకాశంగా మారొచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరి బంగారానికి పెట్టుబడి కేటాయింపులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, గిఫ్ట్ సిటీ ద్వారా పెట్టుబడి మార్గాల గురించి చూద్దాం.


