విక్టరీ వెంకటేష్ నటించిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం కాపీరైట్ వివాదంలో చిక్కుకుంది. త్వరలో విడుదల కానున్న చిన్న చిత్రం ‘పర్ణశాల’లోని ‘జిమ్ జిమ్ తార’ పాటను ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా వెంకటేష్ సీన్‌లో 15 సెకన్ల పాటు ఉపయోగించడంపై ఆ చిత్ర నిర్మాత మంచి వెంకట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ ప్రమోషనల్ పాటను బడా సినిమాలో వాడటం వల్ల తమ చిత్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలతో చిన్న సినిమాల మనుగడ కష్టమవుతుందని, అనుమతి లేకుండా వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
‘అనుమతి లేకుండా మా పాట వాడేశారు.. ‘ఆదర్శ కుటుంబం’ మూవీపై ‘పర్ణశాల’ నిర్మాత ఆగ్రహం
RELATED ARTICLES


