HomeEntertainmentDarling Combo: మళ్లీ సెట్స్‌పైకి ‘డార్లింగ్’ కాంబో?.. ప్రభాస్ కోసం కరుణాకరన్ సరికొత్త లవ్ స్టోరీ!

Darling Combo: మళ్లీ సెట్స్‌పైకి ‘డార్లింగ్’ కాంబో?.. ప్రభాస్ కోసం కరుణాకరన్ సరికొత్త లవ్ స్టోరీ!

‘డార్లింగ్’ వంటి ఎవర్‌గ్రీన్ ఫీల్-గుడ్ బ్లాక్‌బస్టర్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ఎ. కరుణాకరన్ కలయికలో మరో సినిమా రాబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా కరుణాకరన్ సరికొత్త ప్రేమకథను సిద్ధం చేశారని, త్వరలోనే ప్రభాస్‌కు వినిపించనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ‘తొలిప్రేమ’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన కరుణాకరన్.. ఇటీవల బెల్లంకొండ గణేష్‌తో కొత్త చిత్రం ప్రారంభించారు. కాగా ఇటీవల ‘డార్లింగ్’ 4K రీ రిలీజ్ భారీ విజయం సాధించడంతో ఈ క్రేజీ కాంబో వార్తపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments