అమెరికాలోని కాలిఫోర్నియాలో గత రెండు నెలలుగా కనిపించకుండా పోయిన 72 ఏళ్ల భారత సంతతి వృద్ధురాలు అజిత్ కౌర్ ఓ కాలువలో శవమై తేలారు. ఆగస్టు 23వ తేదీన సీరెస్ పట్టణంలోని కాసా గ్రాండే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ నుంచి అదృశ్యమైన ఆమె కోసం పోలీసులు కే9 స్నిఫర్ డాగ్స్, సోనార్ డ్రోన్లతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు.చివరికి అక్టోబర్ 24వ తేదీన టీఐడీ ఉద్యోగి నిత్య తనిఖీల్లో భాగంగా కాలువలో ఓ మృతదేహాన్ని గుర్తించగా.. స్టానిస్లాస్ కౌంటీ కార్నర్ కార్యాలయం నిర్వహించిన విశ్లేషణలో అది అజిత్ కౌర్ మృతదేహమే అని అధికారులు గుర్తించారు.
రెండు నెలల క్రితం అదృశ్యం.. కాలిఫోర్నియా కాలువలో శవమై తేలిన భారత సంతతి వృద్ధురాలు!
RELATED ARTICLES


