తెలంగాణలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కల్వకుంట్ల కవిత.. రెండు సీట్లలోనూ బీసీలకే అవకాశం కల్పించారు. ఇప్పటికే వరంగల్-ఖమ్మం-నల్గొండ టికెట్‌ను నలమాస శ్రీకాంత్ గౌడ్‌కు ఇవ్వగా.. తాజాగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి సీనియర్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరును ఎంపిక చేశారు. ఈ ఎన్నికల పరిశీలకులు, వార్‌రూమ్ ఇంఛార్జ్‌లను కూడా నియమించారు. మరోవైపు.. ఇంద్రవెల్లిలో టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ నిర్వహణకు పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది.


