పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సుమారు 150 వీధి కుక్కలను విషపూరిత ఇంజక్షన్లు ఇచ్చి చంపినట్లు ఆరోపణలు రావడం పెను సంచలనంగా మారింది. పంచాయతీ కార్యదర్శి సూచనలతో సిబ్బంది ఈ చర్యకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుక్కల మృతదేహాలను జులపల్లి డంపింగ్ యార్డు సమీపంలో పాతిపెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన కుక్కలకు పోస్టుమార్టం నిర్వహించి, మరణాలకు కారణాలను శాస్త్రీయంగా నిర్ధారించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.


