దీపావళి హడావిడి అప్పుడే మొదలైంది. దీపావళి, ధనత్రయోదశి పండగల సీజన్ రాగానే అందరూ బంగారు షాప్స్ వైపు పరుగులు తీస్తుంటారు. అయితే, కొనుగోలు చేసే సమయంలో అందరి మనసులో ఉండే ఒకే ఒక్క భయం.. మనం తీసుకునే గోల్డ్ స్వచ్ఛమైందా లేదంటే నకిలీదా అని? ప్రస్తుతం ఇత్తడి వస్తువులపై గోల్డ్ పాలిష్ ఎంత అద్బుతంగా చేస్తున్నారంటే.. అనుభవం ఉన్న నగల వ్యాపారులు కూడా కొన్నిసార్లు మోసపోయే ప్రమాదం ఉంది.
అందువల్ల బంగారం స్వచ్ఛత కోసం కేవలం వ్యాపారులపైనే పూర్తిగా ఆధారపడాల్సిన పనిలేదు. ఇంట్లోని సాధారణ వస్తువులతోనే రెండు నిమిషాల్లో బంగారం అసలైనదా కాదా అనేది ప్రాథమికంగా గుర్తించవచ్చు. ఎలానో తెలుసుకుందాం.


