బద్రీనాథ్- జోషిమఠ్ మార్గంలో చార్ధామ్ యాత్రికుల విమానం గల్లంతయ్యింది. బద్రీనాథ్ నుంచి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంచు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణం వల్ల హెలికాప్టర్‌తో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు తెలిపారు. హెలికాప్టర్‌ను నడుపుతోన్న పైలట్ ఢిల్లీకి చెందినవారు కాగా.. యాత్రికులు ఐదుగురు బెంగళూరుకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


