న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ధారాళంగా పరుగులు ఇస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, మాజీ కెప్టెన్ అజింక్య రహానే అతనికి అండగా నిలిచాడు. నాలుగేళ్ల విరామం తర్వాత 36 ఏళ్ల వయసులో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే అతిపెద్ద స్టోరీ అని కొనియాడాడు. భువి ప్రదర్శనను అప్పుడే జడ్జ్ చేయవద్దని విమర్శకులకు హితవు పలికాడు. నాలుగో టీ20లో అతడు సత్తా చాటుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.


