Chiranjeevi’s Megaverse: చిరంజీవి ఓటీటీ ఎంట్రీపై వస్తున్న వార్తలకు తెరదించుతూ, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మెగాస్టార్ హోస్టుగా టాక్ షోను అధికారికంగా ప్రకటించింది. ‘మెగావర్స్’ పేరుతో త్వరలోనే ఈ షో ప్రసారం కానుందని తెలిపింది. “మాస్‌కి గ్రామర్, స్టైల్‌కి డెఫినిషన్” అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను పంచుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇటీవలే ఈ షో షూటింగ్ ప్రారంభమవ్వగా.. బ్రహ్మానందం, సునీల్, సత్యలతో ఓ ఎపిసోడ్ షూట్ చేసినట్లు సమాచారం.
Chiranjeevi Netflix: మాస్‌కి గ్రామర్, స్టైల్‌కి డెఫినిషన్.. చిరంజీవి ‘మెగావర్స్’ టాక్ షోని ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్
RELATED ARTICLES


