నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఎపిక్ మూవీ ‘రామాయణం’. దీపావళి కానుకగా నవంబర్ 5న ఈ మూవీ మొదటి భాగాన్ని విడుదల చేయనున్నారు. భారతీయ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఫీవర్ ఇప్పుడు పాకిస్తాన్ లోనూ కనిపిస్తోంది. కరాచీలో ఉన్న హిందువులు ఈ సినిమా విడుదల సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు. రణబీర్, సాయి పల్లవి, యష్ పోస్టర్లతో వీధుల్లో సందడి చేస్తూ.. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ‘రామాయణం’ మూవీని తమ దేశంలోనూ రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.
పాకిస్తాన్లోనూ ‘రామాయణం’ ఫీవర్.. కరాచీ వీధుల్లో ‘జై శ్రీరామ్’ నినాదాలు.. నెట్టింట వైరల్ వీడియో
RELATED ARTICLES


