ఓ బామ్మ తన గర్భా వేడుకల వేళ ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో రూ.200 పెట్టి ఓ కూపన్ కొనుగోలు చేసింది. అందులో ఆరు సంవత్సరాల వయసున్న తన మనవడి పేరును రాసింది. గతేడాది ఈ కూపన్ కొంటే.. తాజాగా లక్కీ డ్రా తీయగా ఆ టిక్కెట్‌కు మొదటి బహుమతి వచ్చింది. ఫస్ట్ ప్రైజ్‌గా రూ.50 లక్షల ఖరీదైన టయోటా ఫార్చ్యూనర్ కారు రావడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.


