గత నెల 30వ తేదీన యూఏఈలోని దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు వెళ్తోన్న విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై ఒమాన్ జాతీయుడైన కో-పైలట్ దాడి చేసి, హైజాక్‌కు ప్రయత్నించాడు. అయితే, అతడి చర్యలను ప్రతిఘటించి, తాను గాయపడినా లెక్కచేయకుండా పోరాటం చేసిన స్మిత్.. విమానంలోని 174 మంది ప్రాణాలను కాపాడారు. ఈ ధైర్యసాహాసానికి యూఏఈ తాజాగా అత్యున్నత పురస్కారంతో సత్కరించింది.


