కర్ణాటకలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు స్థానాలనూ ఎన్డీయే కూటమి కైవసం చేసుకోగా.. అధికార కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. బెంగళూరు టీచర్స్ నియోజకవర్గాన్ని బీజేపీ మద్దతుతో జేడీయూ గెలుచుకుంది. మిగతా మూడు సిట్టింగ్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. దీంతో కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌పై బీజేపీ సెటైర్లు వేసింది. ఇట్స్ డన్ బ్రో అంటూ ఎక్స్‌లో పోస్టులు చేసింది.


