ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. టీ20ఐ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ మళ్లీ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకోగా, టెస్ట్ ఆల్‌రౌండర్ల జాబితాలో నాలుగేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న భారత దిగ్గజం రవీంద్ర జడేజాను వెనక్కి నెట్టి సౌతాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ ప్రథమ స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో మార్కో జాన్సెన్.. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను అధిగమించి ఐసీసీ నంబర్ 1 టెస్ట్ బౌలర్‌గా కూడా అవతరించాడు.


