అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా చొరబడినట్లు కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియోలు నకిలీవని భారత సైన్యం తేల్చి చెప్పింది. ముఖ్యంగా ఇవన్నీ ఏఐతో వాడిన ఫేక్, డీప్‌ఫేక్ వీడియోలు అని స్పష్టం చేసింది. ఈ ఉదంతంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత సాయుధ బలగాల ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.


