HomeEntertainmentFauzi: ‘ఫౌజీ’ మూవీపై నేతాజీ మనవడి ఆగ్రహం.. దేశ ప్రజలకు డైరెక్టర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

Fauzi: ‘ఫౌజీ’ మూవీపై నేతాజీ మనవడి ఆగ్రహం.. దేశ ప్రజలకు డైరెక్టర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫౌజీ’ సినిమా గ్లింప్స్ వివాదంలో చిక్కుకుంది. అందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను చూపించిన తీరు, అడాల్ఫ్ హిట్లర్‌తో భేటీ దృశ్యాలు చారిత్రక వాస్తవాలను వక్రీకరించేలా ఉన్నాయని నేతాజీ మునిమనవడు చంద్రకుమార్ బోస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ నాయకుల చరిత్రను కల్పితాలతో దిగజార్చడం నేరమని, చిత్ర దర్శకుడు భారత ప్రజలకు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు, హీరో పాత్రను ఎలివేట్ చేయడానికి నేతాజీని ఉపయోగించుకున్నారని, ఆయన లుక్ రూపకల్పన సరిగ్గా లేదంటూ సోషల్ మీడియాలోనూ ‘ఫౌజీ’ గ్లింప్స్‌పై భారీగా ట్రోల్స్ వస్తున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments