ఐపీఎల్ 2027 కోసం చెన్నై సూపర్ కింగ్స్ తమ కొత్త హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేస్ దిగ్గజం జహీర్ ఖాన్‌ను నియమించింది. సుదీర్ఘంగా 18 ఏళ్లు జట్టుకు కోచ్‌గా పనిచేసిన స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో జహీర్ రానున్నాడు. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు కీలక బాధ్యతల్లో పనిచేసిన అనుభవం జహీర్‌కు ఉంది. ఐపీఎల్‌లో 102 వికెట్లు, అంతర్జాతీయంగా 610 వికెట్లు తీసిన జహీర్ రాకతో తమ యంగ్ టీమ్ మరింత బలోపేతమవుతుందని సీఎస్‌కే యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.


