రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందజేసే సరుకులు, నిత్యావసర ధరల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇందుకోసం 12 మందితో కూడిన ప్రత్యేక విజిలెన్స్ కమిషన్ను ఏర్పాటు చేసింది. వీరికి జిల్లా పౌరసరఫరాల అధికారులు, అసిస్టెంట్ ఆఫీసర్లు సహాకరించనున్నారు. ఎక్కడైనా అక్రమాలు, అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తే.. మెరుపు తనిఖీలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన క్షేత్రస్థాయి నివేదికలను పౌరసరఫరాల కమిషన్కు అందజేయనుంది. అక్రమాలను నిరోధించేందుకు కమిటీ చర్యలు తీసుకోనుంది.
నిత్యావసర ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు.. విజిలెన్స్ కమిటీ ఏర్పాటుచేస్తూ కీలక నిర్ణయం
RELATED ARTICLES


