తిరుమలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. సెప్టెంబర్ 15న మొదలైన ఈ ఉత్సవాలు 23వ తేదీతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ బ్రహ్మోత్సవాల్లో లక్షలాది భక్తులకు వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం కల్పించామని టీటీడీ చైర్మన్ తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించుకునేందుకు 5.76 లక్షల భక్తులు వచ్చారని, రూ.28.94 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
ముగిసిన పవిత్ర బ్రహ్మోత్సవాల ఘట్టం.. సమిష్టి కృషితో విజయవంతం
RELATED ARTICLES


