అందం కోసం ప్రతిఒక్కరూ రకరకాల స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. స్కిన్‌కేర్‌లో కొత్త కొత్త ఇంగ్రిడియెంట్స్ గురించి మనం తరచూ వింటుంటాం. ఇప్పుడు అలాంటి వాటిలో గాలిక్ యాసిడ్ కూడా చేరింది. ఇది సహజంగా లభించే యాంటీఆక్సిడెంట్. కాలుష్యం, ఎండ వంటి వాటి ప్రభావం వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గించడంలో ఇది సహాయపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి గాలిక్ యాసిడ్ అంటే ఏమిటి? చర్మానికి ఇది ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుంది? వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం.


