బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్లలో సెటిల్ అయ్యారు. ఆయుర్వేద వైద్యుడిగా అందరికీ పరిచయమైన ఆయన ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆర్థికంగా స్థిరపడిన బంగ్లాదేశీ.. తన పూర్తి అడ్రస్‌ను మాచర్ల చేసుకున్నారు. అయితే, ఇటీవల జరిగిన సర్ వెరిఫికేషన్‌తో పాటు పాస్‌పోర్ట్ రీ వెరిఫికేషన్‌తో అతను బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినట్లు తేలింది. ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు కానిస్టేబుళ్లు భారీ ముడుపులు కూడా తీసుకున్నారని తేలడంతో వారిని పోలీసులు సస్పెండ్ చేశారు.
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మాచర్లకు.. ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ముడుపులు గుంజిన పోలీసులు.. బేరాలు కుదరక గుట్టురట్టు!
RELATED ARTICLES


