నేపాల్‌లోని త్రిశూలి బజార్లో సంభవించిన వినాశకర వరదలు నాలుగు ఇళ్లను ఊడ్చిపెట్టుకుపోగా.. అక్కడ ఒక పెంపుడు కుక్క చూపుతున్న విశ్వాసం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. జేసీబీ యంత్రాల శబ్దాలు, శిథిలాలు తొలగిస్తున్న సందడి మధ్య కూడా ఆ మూగజీవి తన ఇల్లు ఉన్న ముంగిలి సరిహద్దులను దాటి బయటకు రావడం లేదు. మెడలో బెల్ట్‌తో బురదలోనే కూర్చుని.. వరదల్లో గల్లంతు అయిన తన యజమాని, కుటుంబ సభ్యుల రాక కోసం రాత్రింబవళ్లు ఎదురుచూస్తూ అక్కడికక్కడే నిరీక్షిస్తోంది.
నేపాల్ వరదల్లో కన్నీళ్లు పెట్టించే ఘటన.. ఇళ్లంతా నేలమట్టమైనా, యజమాని కోసం అక్కడే కూర్చుని శునకం నిరీక్షణ
RELATED ARTICLES


