HomeEntertainment'కాంతార' బ్యూటీకి టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్.. సాయితేజ్ కొత్త చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్!

‘కాంతార’ బ్యూటీకి టాలీవుడ్‌లో బంపర్ ఆఫర్.. సాయితేజ్ కొత్త చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్!

మెగా సుప్రీం హీరో సాయిదుర్గా తేజ్, దర్శకుడు తేజ కాకుమాను కాంబినేషన్‌లో అనిల్ సుంకర నిర్మిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. అటవీ నేపథ్యంతో భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో సాగే ఈ యాక్షన్ డ్రామాలో సాయితేజ్‌కి జోడీగా ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, జాతీయ స్థాయి స్విమ్మర్ అయిన ఈ కన్నడ బ్యూటీకి ఇది టాలీవుడ్‌లో కీలక అవకాశం కానుంది. ఈ నెలాఖరులోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు సాయితేజ్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ సంక్రాంతి కానుకగా 2027 జనవరి 12న విడుదల కానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments