ఈశాన్య రాష్ట్రం, చైనా సరిహద్దుల్లోని అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన భారీ హైడల్ విద్యుత్ ప్రాజెక్ట్‌కు నిరసనగా తూర్పు సియాంగ్ జిల్లాల్లో చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ ఘటనలో ఓ ఎమ్మెల్యే ఇంటిని ఆందోళనకారులు లూటీ చేశారు. అలాగే, పోలీస్ స్టేషన్, పవర్ ప్రాజెక్ట్ ఆఫీసుకు నిప్పంటించారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు.. కఠిన ఆంక్షలు ప్రకటించారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో నిరసనలు తీవ్రరూపం.. ఎమ్మెల్యే నివాసం లూటీ, ప్రాజెక్ట్ ఆఫీసు, పోలీస్ స్టేషన్‌కు నిప్పు
RELATED ARTICLES


