
ఏపీలో గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ రాజకీయ ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. యువకుడ్ని పోలీసులే కొట్టి చంపారని రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ నిర్దారించింది. ఇటీవల ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ.. పోలీస్ స్టేషన్ సిబ్బందిని శనివారం విచారించింది. ఈ సందర్భంగా గాయపడిన సాయికృష్ణకు చికిత్స చేయడానికి ఆర్ఎంపీని తీసుకొచ్చిన విషయం ప్రశ్నించింది.


