సుచిత్ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఫీల్ గుడ్’. దయానంద్ దర్శకత్వంలో విశ్వరూప ఫిల్మ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో అదితి త్రిపాఠి కథానాయిక. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ అనే యూత్‌ఫుల్ లవ్ ట్రాక్‌ను మేకర్స్ విడుదల చేశారు. కడలి సత్యనారాయణ సాహిత్యం అందించిన ఈ పాటకు శాండిల్య పిసపాటి సంగీతంతో పాటు తుషార నిలయతో కలిసి ఆలపించారు. నేటి తరం ట్రెండీ పదాలతో సాగే ఈ గీతం సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
ఉర్రూతలూగిస్తున్న ‘మమ్మా మియా’.. ‘ఫీల్ గుడ్’ మూవీ నుంచి అదిరిపోయే యూత్‌ఫుల్ ట్రాక్
RELATED ARTICLES


