కూరగాయలన్నింటినీ ఫ్రిజ్‌లో భద్రపరిచినట్లే ఆలుగడ్డలను కూడా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే వెంటనే ఆ అలవాటును మార్చుకోండి. శీతల ఉష్ణోగ్రతల్లో ఆలూలోని పిండిపదార్థాలు రూపాంతరం చెంది రుచి మారడమే కాకుండా, ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలుగా మారే అవకాశముందని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.