వర్షాకాలమే అయినప్పటికీ అంతగా వర్షాలు పడట్లేదు. పైగా ఒక్కటే ఉక్కపోత. చూడ్డానికి ఎండాకాలంలా కనిపిస్తుంది. దీంతో చాలా మంది పెరిగిన వేడి, ఉక్కపోతని తట్టుకునేందుకు కూలర్స్, ఏసీలు వాడుతున్నారు. ఏసీలు వాడుతున్నామంటే వాడుతున్నట్లు కాదు. బయటి వాతావరణాన్ని బట్టి ఏసి సెట్టింగ్స్‌ని మారుస్తుండాలి. అప్పుడే అది సరిగ్గా పనిచేస్తుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ఏమాత్రం మనం సెట్టింగ్స్‌ని మార్చకపోయినా ఆరోగ్య సమస్యలొస్తాయి. పైగా ఏసి కూడా సరిగా పనిచేయదు. వర్షాకాలంలో గాలిలో తేమ విపరీతంగా పెరుగుతుంది. అలాంటప్పుడు ఎయిర్ కండీషనర్‌ని సెట్ చేయకపోతే సమస్యలతో పాటు కరెంట్ బిల్ పెరగడం, ఇతర సమస్యలొస్తాయి.


