మనకు మినపప్పు వడ లేదా మసాలా వడలు అంటే చాలా ఇష్టం. చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే, వీటి తయారీ విధానం చాలా కష్టంతో కూడుకున్న పని. వీటిని తయారీ చేయాలంటే పప్పు నానబెట్టాలి, రుబ్బాలి ఇలా చెప్పుకుంటే పోతే చాలా పనులుంటాయి. అయితే, నిమిషాల్లో క్రిస్పీ వడ తినాలనుకునేవారి కోసం ఓ బెస్ట్ ఛాయిస్ ఉంది. అదే అటుకుల వడ. దీనిని అటుకులు, ఉల్లిపాయలు, బియ్యప్పిండి, వంటింట్లో సులభంగా దొరికే సాధారణ పదార్థాలతో అప్పటికప్పుడు చేసుకున్న రుచికరమైన స్నాక్.
ఈ వడలు బయట ఎంతో క్రిస్పీగా, కరకరలాడుతూ.. లోపల మెత్తగా ఉంటాయి. సాధారణ పప్పు వడలు కాసేపటికి మెత్తబడిపోతాయి. కానీ అటుకుల వడలు తయారైన తర్వాత కూడా చాలా గంటల వరకు కరకరలాడుతూనే ఉంటాయి. కాబట్టి వీటిని కాస్త ముందే చేసి పెట్టుకున్నా అతిథులకు వడ్డించే సమయానికి క్రంచీగానే ఉంటాయి. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఏంటో ఓ లుక్కేయండి.


