ఉదయాన్నే లేవగానే కాళ్లు, చేతులు తీవ్రంగా గుంజడం, చేతుల్లో సూదులతో గుచ్చినట్లు తిమ్మిర్లు రావడం లేదా రోజంతా నీరసంగా అనిపిస్తోందా? అయితే ఈ లక్షణాలు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ నరాలు తీవ్రంగా బలహీనపడుతున్నాయని ఇవే సంకేతం. ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారంలో విటమిన్ B12, ఐరన్, క్యాల్షియం వంటి పోషకాలు తగ్గడమే దీనికి ప్రధాన కారణం. అందుకే రోజువారీ ఆహారంలో పోషకాలు అందేలా చూసుకోవడం ముఖ్యం.
కేవలం ఇంగ్లీష్ మందుల వెనకాలే పడకుండా.. మన ఇంట్లోనే దొరికే రాగులు, నువ్వులు, పల్లీలు, తవుడు, బెల్లం, నెయ్యి లాంటి సహజ పదార్థాలతో చేసుకునే ఈ 8 అద్భుతమైన లడ్డూలు నరాలకు అమృతంలా పనిచేస్తాయి. నరాల బలహీనతను దూరం చేసి, ఒంటికి కొండంత బలాన్ని ఇచ్చే ఆ శక్తివంతమైన లడ్డూలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం.


