హన్మకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్‌పై కామెంట్స్ చేశారు. పరకాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. తనపై కొందరు ‘పిల్లకాకులు’ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటివి తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ప్రజాదరణ చూసే తనను అభ్యర్థిగా ప్రకటించారని వెల్లడించారు.


