HomeVideosపోలీస్ స్టేషన్లకి జేసీ స్టేషన్ అని పేరు పెట్టండి: కేతిరెడ్డి పెద్దారెడ్డి

పోలీస్ స్టేషన్లకి జేసీ స్టేషన్ అని పేరు పెట్టండి: కేతిరెడ్డి పెద్దారెడ్డి

తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడిపత్రిలో విచ్చలవిడిగా అక్రమ మద్యం, గంజాయి, పేకాట దందాలు సాగుతున్నాయని, వీటిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ల ముందే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, పోలీస్ స్టేషన్లకు ‘జేసీ స్టేషన్లు’ అని పేరు పెడితే సరిపోతుందని వ్యాఖ్యానించారు. 24 మంది వైఎస్సార్‌సీపీ నేతలను అంతం చేస్తామని హెచ్చరిస్తున్నా ఎస్పీ, కలెక్టర్ పట్టించుకోవడం లేదని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments