రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలోని రాంపురా కన్వర్పురా ప్రభుత్వ పాఠశాల దుస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులపై దాడి జరిగింది. సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా, ఆయన బృందంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. పశువుల పాక లాంటి రేకుల షెడ్లో విద్యార్థులు చదువుకుంటున్న తీరును కవర్ చేసేందుకు వెళ్లగా.. రహదారిని దిగ్బంధించి వాహనాలను ధ్వంసం చేసి, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒక కార్యకర్త చేయి విరిగినట్లు సమాచారం. ఈ దాడి వెనుక అధికార బీజేపీ హస్తం ఉందని సీజేపీ ఆరోపించగా.. పాఠశాల నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయని, రాజకీయం చేయొద్దనే బయటి వారిని అడ్డుకున్నామని స్థానికులు అంటున్నారు.


