శ్రీలంకతో కొలంబో వేదికగా జరగనున్న రెండో టెస్టుకు ముందు భారత తుది జట్టు ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వరుసగా రెండో రోజు ప్రాక్టీస్‌కు దూరంగా ఉండి హోటల్ రూమ్‌కే పరిమితమవ్వడం అనుమానాలను పెంచింది! మరోవైపు ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. అంతేకాకుండా కోచ్ గంభీర్, అగార్కర్‌లతో సుదీర్ఘంగా చర్చించాడు. లంక జట్టులో లెఫ్ట్ హ్యాండర్లు పెరగడం కూడా సారాంశ్ డెబ్యూకి మార్గం సుగమం చేస్తోంది.


