న్యూజిలాండ్‌తో క్రిస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లే ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. పవర్‌ప్లేలోనే 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్‌ను గ్లెన్ ఫిలిప్స్ (70), బెవాన్ జాకబ్స్ (58) అర్థశతకాలతో ఆదుకున్నారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. భువీ ఓ వికెట్ తీశాడు.


