భారత్, వెస్టిండీస్ మధ్య ఆదివారం ఇండోర్ వేదికగా మూడో టీ20 జరగనుంది. ఓ వైపు “406? కూల్”, “250? కూల్” అంటూ రెండు జట్ల మధ్య సోషల్ మీడియా వేదికగా రసవత్తర వార్ నడుస్తోంది. మరోవైపు, చిన్న బౌండరీలు ఉన్న ఇండోర్‌లో కూడా పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఫ్లాట్ పిచ్‌లపై భారత బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలను అధిగమించి సిరీస్‌లో మళ్లీ ఆధిక్యం సాధించాలని శ్రేయస్ అయ్యర్ సేన పట్టుదలతో ఉంది.


