రాంచీలో భారత్‌పై 250 పరుగుల మైలురాయి లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత వెస్టిండీస్ కెప్టెన్ షైయ్ హోప్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. 45 బంతుల్లో 102 రన్స్ చేసి జట్టును గెలిపించిన హోప్.. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో “250? కూల్” అని రాసుకొచ్చాడు. గతంలో 406 పరుగుల ఛేజ్ తర్వాత భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ “406? కూల్” అని పెట్టిన పోస్ట్‌కు కౌంటర్‌గానే హోప్ ఈ వ్యాఖ్యలు చేశాడని క్రికెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.


