సీ ఫుడ్స్‌లో రొయ్యలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. చాలా మంది రొయ్యల్ని ఇష్టంగా తింటారు. రొయ్యల పులుసు, రొయ్యల ఫ్రై, రొయ్యల బిర్యానీ, రొయ్యల ఇగురు ఇలా రకరకాలుగా వండుకుని ఆరగిస్తారు. ఇవి రుచికరంగా ఉంటాయి. రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రొయ్యల్లో అనేక పోషకాలు ఉంటాయి. అయితే, రొయ్యలను క్లీన్ చేయడం కష్టంతో కూడుకున్న పని. సరైన పద్ధతి క్లీన్ చేయకుండా లేదా సరిగ్గా ఉడిచకుండా రొయ్యల్ని తింటే మాత్రం తీవ్రమైన అలర్జీలు వచ్చి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే రొయ్యల్ని వండి తినే ముందు కచ్చితంగా ఒక పని చేయాలి. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


